Header Banner

‘థ్యాంక్యూ సీఎం సర్‌, లోకేశ్‌ అన్న’ అంటూ.. చిత్రపటానికి పాలాభిషేకం! ఎందుకు అంటే.!

  Tue Apr 22, 2025 14:43        Politics

డీఎస్సీ అభ్యర్థుల ఆరేళ్ల కలను సీఎం నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖా మంత్రి లోకేశ్‌ సాకారం చేశారని శాప్‌ చైర్మన్‌ అనిమిని రవినాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం డీఎస్సీని విడుదల చేసి ఇది మంచి ప్రభుత్వమని మరోసారి నిరూపించుకుందన్నారు. డీఎస్సీ విడుదల సందర్భంగా తిరుపతి ఆర్డీవో ఆఫీసు ఎదుట డీఎస్సీ అభ్యర్థులు, టీఎన్‌ఎస్ఎప్ నాయకులతో కలిసి సోమవారం చంద్రబాబు, లోకేశ్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. థ్యాంక్యూ సీఎం సర్‌, లోకేశ్‌ అన్న’ అంటూ డీఎస్సీ అభ్యర్థులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. రవినాయుడు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఇదే ప్రాంతంలో నిరసనలు, ధర్నాలు చేపట్టామని, కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. అన్ని కేటగిరీలకు న్యాయం జరిగేలా ప్రస్తుత ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చిందన్నారు. టీఎన్‌ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంట్‌ అధ్యక్షుడు కొట్టే హేమంత్‌ రాయల్‌ మాట్లాడుతూ డీఎస్సీ విడుదల పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని, చెప్పినట్టుగానే 16,347 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేశారని అన్నారు. ఇప్పటికైనా మాజీ సీఎం జగన్‌ రెడ్జి బుద్ధి తెచ్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ నగర అధ్యక్షుడు వెంకటేష్‌ యాదవ్‌, రాష్ట్ర సభ్యులు ఆర్కే నాయుడు, విష్ణు, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. కొత్తగా నేషనల్ హైవే.. జిల్లాలో క్లోవర్‌ లీఫ్‌! ఆకాశనంటుతున్న భూముల ధరలు..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

 

ముంబై నటి కేసులో వైసీపీకి మరో బిగ్ షాక్! ఆ ఐపీఎస్ అధికారి అరెస్టు!

 

తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం.. హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు!

 

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం.! దాదాపు 3 లక్షల మందికి..

 

రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఏపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబుకు త్వరలోనే ఫిర్యాదు.. అసలేమైంది?

 

పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?

 

లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!

 

అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రి, రాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!

 

మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations